లీడర్ న్యూస్ (తణుకు) తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు ఇంపల్స్ జూనియర్ కళాశాల ఆవరణలో తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కేవలం వైద్య సేవలు కాకుండా మహిళా సాధికారతపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని చెప్పారు. యువతతో పాటు మహిళలకు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఎన్నో సేవలు అందిస్తూ విపత్కర పరిస్థితిలోనూ ప్రజలకు అండగా ఉంటూ లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూందని చెప్పారు. తణుకులో కొనసాగుతున్న 8 లయన్స్ క్లబ్బుల ద్వారా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ ఒక మహమ్మారిగా చివరి స్థాయికి వచ్చేవరకు కూడా శరీరంలో తెలియకుండా ఉంటోందన్నారు. క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు ఈ పరిస్థితుల్లో వావిలాల సరళ దేవి ఆధ్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు మరింత విశ్రమం చేసి పేద ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తూ ఆదుకుంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు బీమా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. ఈనెల 7న తణుకులో నిర్వహిస్తున్న 2కె, 5కె,10కె మారథన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
తారకాపురి లయన్స్ సేవలు అభినందినీయం…క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన తీసుకురావాలి…వైద్య శిభిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
02
Dec