లీడర్ న్యూస్ (తణుకు) దేశప్రధాని నరేంద్రమోదీ సంకల్పించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈనెల 7న తణుకులో మారథాన్ నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు రన్‌కు సంబంధించి టీషర్టు, మెడల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 7న ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితోపాటు ఈవెంట్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పాయల్ రాజ్‌పుత్ హాజరవుతున్నట్లు చెప్పారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో ఈ రోడ్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తణుకు పట్టణం క్లీనర్, గ్రీనర్, హెల్దీయర్‌గా ఉండటంతోపాటు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 వేల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లు చేయించుకోదలచిన వారు ఈనెల 6న తణుకు ఎన్టీఆర్ పార్కులో స్పాట్ రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ రన్ నిర్వాహకులు విశ్వతేజ, సాయిదీప్తి, కృష్ణకిరణ్, వినయ్‌పవన్, తణుకు, అత్తిలి ఏఎంసీ ఛైర్మన్లు కొండేటి శివ, దాసం ప్రసాద్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈనెల 7న తణుకులో రోడ్ రన్… *టీషర్టు, మెడల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ… *******
05
Dec