లీడర్ న్యూస్ :- నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో అమరజీవి జల ధార పనులకు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాలో 68 లక్షల మందికి సురక్షిత తగునీరు అందించే ప్రక్రియలో రూ. 3050 కోట్ల నిధులతో ప్రాజెక్టు పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెరవలి జాతీయ రహదారి ఆనుకుని శనివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రులు మంత్రులతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన భార్యాభహిరంగ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. సభను విజయవంతం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ…సభ విజయవంతం పట్ల కృతజ్ఞతలు…
21
Dec