లీడర్ న్యూస్ (తణుకు) మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.తణుకు సజ్జాపురంలో గల పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్యన కారుమూరి కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తధాన శిబిరంలో పలువురు రక్తధానం చేశారు. అనంతరం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద సుమారు 200 మంది మున్సిపాలిటీలో శానిటేషన్ కార్మిక సిబ్బందికి, ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి నిత్యావసరాలు కారుమూరి అందజేశారు. పట్టణంలో గల వాసవి జ్యోతి వృద్దాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారికి దుప్పట్లు, పండ్లు పంపిణి చేశారు.
తణుకులో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు… పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి…
21
Dec