లీడర్ న్యూస్ (తణుకు) తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా పితాని మోహన్‌రావు నియమితులయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీ తణుకు మండలం అధ్యక్షులుగా పని చేసిన మోహనరావును జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా తనకు పదవి రావడానికి సహకరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పితాని మోహనరావును ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించి అభినందించారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పితాని మోహన్‌రావును అభినందించారు.
టిడిపి జిల్లా కార్యదర్శిగా పితాని మోహన్‌రావు* *అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ*
22
Dec