లీడర్ న్యూస్ (తణుకు) విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా చదరంగం క్రీడ మేథస్సును పెంచుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్– 19 చదంగం పోటీలు తణుకుSఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో తణుకు పట్టణంతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుండి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదరంగం క్రీడలో పాల్గొనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు ప్రభావితం కాకుండా ఇలాంటి క్రీడల్లో వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ జీవీకుమార్, మాస్టర్ చెస్ అకాడమీ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, అమర్నాథ్, ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.రత్నకుమారి, డిసి టోర్నమెంట్ కమిటీ మెంబర్ జె.రాంబాబు, ఎల్లా ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చదరంగం మేథస్సును మెరుగుపర్చుతుంది* *తణుకులో చెస్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ….
22
Dec