లీడర్ న్యూస్ (తణుకు) గత ప్రభుత్వంలో ఎస్సీలు నా మేనమామలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గునపాలు గుచ్చారని తణుకు ఏయంసీ చైర్మన్ కొండేటి శివ విమర్శించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మాస్క్ లు అడిగినందుకు వైసీపీ వారు రోడ్లపై అతన్ని వెంటాడి వేధించి చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేసారని మండిపడ్డారు. 27 దళిత పధకాలను రద్దు చేశారని, అంబేద్కర్ విదేశీ విద్య పేరు తొలగించి, జగనన్న విదేశీ విద్య పేరు మార్చి అవమానించారన్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి ఆ 27 పధకాలను రూపొంచించి, విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును ఏర్పాటు చేయాలని కోరారు.
సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం 1 కోటి రూపాయలు నగదు, వారి కుమారుడికి గ్రూప్ 2 లో ఉద్యోగం ఇచ్చారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం sc లను చులకనగా చూసిందన్నారు. డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసిన ఘటన ఇంకా మరువలేదన్నారు.డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం 1 కోటి, గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడం హర్షం వ్యక్తం చేసున్నట్లు తెలియజేశారు.