లీడర్ న్యూస్ (తణుకు) తణుకు నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తొలుత కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాతవూరు ఎన్టీఆర్ పార్కు వద్ద షాదీ ఖానా, తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించిన ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విలువలు మనందరికీ శాశ్వతంగా మార్గదర్శకాలు కావాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సమష్టి కృషితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రమగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు… — జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ…
27
Jan