అర్జునుడుపాలెం గ్రామ పాలకవర్గ ఆత్మీయ సమావేశం…సర్పంచ్ పోతుల గంగాధర్ కి ఘన సన్మానం… పలువురు జనసేనపార్టీలో చేరిక…

లీడర్ న్యూస్ (ఇరగవరం) అర్జునుడుపాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గం 5 ఏళ్ల పదవికాలం మరో నెలలో పూర్తి అవుతున్న సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ పోతుల గంగాధరరావు ఆధ్వర్యంలో పాలకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర రావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి పాలకవర్గం అందించిన సహకారం అభినందనీయమని, పాలకవర్గం తో పాటు గ్రామ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను గంగాధరరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపిక ను బహుకరించారు. అనంతరం గంగాధరరావు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన యువకులు సుమారు 30 మంది జనసేన పార్టీ లోకి చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు అనుకూల రమేష్, కాట్నం విశాలి, అకేటి కాశీ, బెజవాడ సూరి, గ్రామ ప్రజలు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *