భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి – బళ్ళ చిన వీరభద్రరావు

లీడర్ న్యూస్ (తణుకు) భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తక్షణం పునరుద్ధరించి 2020 సెప్టెంబర్ నుండి దరఖాస్తు పెట్టుకున్న భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బళ్ళ చిన దేవతల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సమావేశం వాటాల నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ 2026 మార్చి ఒకటో తేదీ నుండి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించి పెళ్ళికానుక. డెలివరీ పారితోషకం. సాధారణ మరణం. అంత్యక్రియలకు సంబంధించిన క్రైమ్ లు అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలో చేసిన ప్రమాద మరణం. అంగ వైకల్యానికి. హాస్పటల్ ఖర్చులు. స్కాలషిప్పులు వంటి పథకాలు కూడా బోర్డు నుండి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వం 2020 సంవత్సరంలో బోర్డుని రద్దు చేసి కార్మికులకు ప్రభుత్వం పథకాలు నిలిపివేసిన తేదీ నుండి దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన వారందరికీ ఈ పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరించి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం 100 కోట్లు మాత్రమే నిధులు కేటాయించడం కార్మికులను మోసగించడమేనని ఆయన ఆరోపించారు.గత 5 సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకున్న కార్మికులకు క్రైమ్ లు పరిష్కరించడానికి 1000 కోట్లు కూడా సరిపోవని ఆయన చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *