లీడర్ న్యూస్ (తణుకు) అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిందని అన్నారు. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాడ్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసిందని గుర్తు చేశారు. వేతనాల పెంపు అంశాన్ని వీలైనంత త్వరగా అమలు చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తాను తీసుకువెళతానని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం.. *ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీల సమస్యలు తీసుకెళ్తా – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
01
Mar