Vivo X100 Series Launch : వివో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి… ఫీచర్స్ మరియు ధరలు అదుర్స్ !

Vivo X100 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త 3 ఫోన్లు రాబోతున్నాయి. వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100s ప్రో వచ్చే వారం లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. వివో కొత్త హ్యాండ్‌సెట్‌లను చైనాలోని ఆన్‌లైన్ స్టోర్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్‌ల కోసం లిస్టు చేసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతేకాదు.. వివో మూడు ఫోన్ల కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. వివో X100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. అదనంగా, కొత్త వివో ఎక్స్100 సిరీస్ ఫోన్‌ల ధరలను రివీల్ చేశారు.

 ఆన్‌లైన్ స్టోర్‌లో అడ్వాన్స్ బుకింగ్ :

Related News

వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రోలను మే 13న ప్రకటించనున్నట్లు కంపెనీ వెయిబోలో వెల్లడించింది. ఈ ఫోన్ల లాంచ్ ఈవెంట్ చైనాలో స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు (సాయంత్రం 4:30 ) జరగనుంది. ఈ 3 ఫోన్‌లు ప్రస్తుతం చైనాలోని వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌లకు అందుబాటులో ఉన్నాయి. వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్ ప్రో రెండూ స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

వివో ఎక్స్100 సిరీస్ ధర, సేల్ తేదీలు లీక్ :
మరోవైపు, వివో ఎక్స్100ఎస్ స్పేస్ గ్రే, బ్లూ క్లౌడ్, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ పోస్ట్ ప్రకారం.. వివో X100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్ ప్రో మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటాయి.

12జీబీ+ 256జీబీ, 16జీబీ+ 512జీబీ, 16జీబీ+ 1టీబీ వేరియంట్లు ఉన్నాయి. వివో ఎక్స్100ఎస్ 12జీబీ+ 256జీబీ, 16జీబీ + 256జీబీ, 16జీబీ + 512జీబీ, 16జీబీ+ 1టీబీ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లలో అందించనుంది. అదనంగా, భారతీయ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. రాబోయే ఫోన్‌ల ధర, సేల్ తేదీలను లీక్ చేశారు.

పోస్ట్ ప్రకారం.. వివోX100 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ సీఎన్‌వై 6,699 (దాదాపు ధర రూ. 77,500) ఉండనుంది. వివో X100s మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 46,200)గా ఉండనుంది. అదే వేరియంట్ వివో X100s ప్రో ధర సీఎన్‌వై 4,999 (సుమారు రూ. 57వేలు) ఉంటుంది. వివో X100 అల్ట్రా ఫోన్ మే 28 నుంచి విక్రయానికి రానుంది. అయితే, వివో X100ఎస్, వివో X100s ప్రో మోడల్స్ మే 17 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *