లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి ) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో కలసి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతీ అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి వస్తున్న పిర్యాదులు… సంబంధిత అధికారుతో మాట్లాడి పరిష్కరిస్తున్న వైనం..!
27
Jul