లీడర్ భాస్కర్ న్యూస్ (మచిలీపట్నం)రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వచ్చే 2029 సంవత్సరం నాటికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.మంగళవారం ఉదయం కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని కంకిపాడు మండల హౌసింగ్ గోదామును మంత్రివర్యులు తనిఖీ చేశారు.గోదాములో ఉన్న గృహ నిర్మాణ సామాగ్రి నిల్వ రిజిస్టర్లు, పంపిణీ రసీదులు, తదితర రికార్డులు పరిశీలించారు.గోదాముకు ఎన్ని సిమెంట్ బస్తాలు వస్తున్నాయి, ఎన్ని టన్నుల స్టీల్ వస్తుంది, తలుపులు తదితర సామాగ్రి ఎంత మేరకు వస్తోంది ఎంతమందికి ఆ సామాగ్రిని పంపిణీ చేశారు తదితర వివరాలను మంత్రి హౌసింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.కంకిపాడు గోదాముకు 1,16,881 బస్తాల సిమెంటు రాగా 1,16,182 బస్తాలు లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఇంకా 699 బస్తాలు నిల్వ ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.అలాగే 8,13,290 కిలోల స్టీలు అందగా 6,83,692 కిలోల స్త్రీలు పంపిణీ చేయగా 1,29,598 కిలోల స్టీలు నిల్వ ఉందన్నారు. అలాగే త, విద్యుత్తు, రంగులు తదితర సామాగ్రి 300 రాగా అందులో 249 పంపిణీ చేశామని ఇంకా 51 సామాగ్రి నిల్వ ఉన్నాయని హౌసింగ్ అధికారులు మంత్రికి వివరించారు.ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు 90 బస్తాల సిమెంటు, 485 కిలోల స్టీలు దశలవారీగా అందజేయడం జరుగుతుందనని, లబ్ధిదారులకు ప్రభుత్వ మంజూరు చేస్తున్న 1.80 లక్షల రూపాయల లో పట్టుకోవడం జరుగుతుందని హౌసింగ్ అధికారులు మంత్రికి వివరించారు.