లీడర్ న్యూస్ (తణుకు) మోంథా తుఫాన్ కారణంగా తణుకు మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం వైసిపి నాయకులతో కలిసి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట నష్టపొయిన రైతులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, అడ్డా బాబు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలి – మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు…
03
Nov