మత్సకార కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణి చేయనున్న మంత్రి నిమ్మల…

లీడర్ న్యూస్ (పాలకొల్లు) గత వైసిపి ప్రభుత్వంలో గోదావరికి వరదలు వస్తే తాడేపల్లి రాజప్రసాదం వదిలి జగన్ పరామర్శించడానికి రాలేదని…. అధికారం లేకపోయినా చంద్రబాబు దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం, పర్యటించి బాధితుల ఇంటింటికి వెళ్లి ధైర్యం చెప్పారని రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో తుఫాన్ సాయంగా మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యవసర సరుకులను ఆయన కూటమి నాయకులతో కలిసి అందజేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో తుఫాన్ వల్ల ఉపాధి కోల్పోయిన అగ్నికుల క్షత్రియుల మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నామని, మీ కష్టాలు… కన్నీళ్లు తెలిసిన చంద్రబాబు సాయం అడక్కపోయినా తుఫాన్ తీరం దాటిన గంటల్లోనే సాయం ప్రకటించి మరుసటి రోజు నుంచి అందిస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో తుఫాను వరదలు వంటి సమయంలో కనీసం పునరావస శిబిరాలు వంటివి ఏర్పాటు చేయకుండా రూపాయి సాయం కూడా అందించలేదని… అటువంటి తరుణంలో మీ అందరితో కలిసి పీక లోతు వరద నీటిలోనే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన వ్యక్తం చేసిన సంఘటనను గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ మీకు అండగా ఉండేది తానేనని తెలిపారు. అధికారం కోసం, దోచుకునేందుకు తెల్ల బట్టలు వేసుకొని మీ వద్దకు వచ్చే వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని…. మీ కోసం పని చేసే కూటమి మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మత్స్యకార మంత్రి రామానాయుడు కోరారు. గత టిడిపి ప్రభుత్వంలో అగ్నికుల క్షత్రియుల మత్స్యకార కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీ ఏర్పాటు చేశానని, గత వైసిపి ప్రభుత్వం లో రూపాయి అభివృద్ధి నోచుకోలేదు అన్నారు. నేడుమళ్లీ కూటమి ప్రభుత్వంలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేస్తానని మంత్రి రామానాయుడు హామీ ఇచ్చారు. గోదావరి ఏటిగట్టు పట్టిష్టతకు 18 కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని ఇది పనిచేసే ప్రజా ప్రభుత్వమని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *