లీడర్ న్యూస్ (మంగళగిరి)పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం,పొన్నాడకు చెందిన చింతపల్లి మధుకి ఎడమ చేతి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 1,62,000 ముఖ్యమంత్రి సహయ నిధి ఎల్.ఒ.సి.ని జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్ అందజేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మధుకి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందున ఆర్ధిక సాయం కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సిఫార్సుతో ముంజూరు అయిన ఎల్.ఒ.సి.ని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మధు కుటుంబ సభ్యులకు అందజేశారు.
పిఠాపురంలో వ్యక్తి వైద్యానికి ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్…
04
Nov