సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన పంటలు పండించాలి – జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

లీడర్ న్యూస్ (అత్తిలి)మంగళవారం అత్తిలి మండలం స్కిన్నేరపురం గ్రామంలో శ్రీ ఎర్ర నారాయణ స్వామి కళ్యాణ మండపంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామస్థాయి కార్యచరణ సమావేశమునకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరముకు సంబంధించిన వ్యవసాయ కార్యచరణ ప్రణాళికకు సంబంధించి రైతులతో మాట్లాడారు. రైతులు అందరూ ఏదైతే వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆక్వా, హార్టికల్చర్ రంగాలకు సంబంధించి ఆదాయం పెంచుకునే విధంగా నూతన సాంకేతికతను ఉపయోగించాలన్నారు. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రోనులు ఉపయోగించి పెట్టుబడి తగ్గించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన పంటలను పండించాలని సూచించారు. పొలము గట్లు, దిబ్బలు, ఇంటి వద్ద ఖాళీ స్థలములలో కూరగాయల పెంపకములు పెంచి వాటి ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో ఏ సమయంలో, ఏ పంటలు రైతులకు లాభసాటిగా ఉంటాయో తెలుసుకుని వాటి ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవాలని అన్నారు. ఏ రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది రైతులకు వివరించారు. ఎక్కువ ఆదాయం వచ్చే పద్ధతులపై మొగ్గు చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

అనంతరం స్కిన్నేరపురం రైతు సేవా కేంద్రమును జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. గోనె సంచులు, బరకాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. దిత్వ తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాలు కారణంగా రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా భద్రపరుచు కోవాలని సూచించారు. దీనికోసం రైతు సేవా కేంద్రాల వద్ద, సొసైటీలు వద్ద బరకాలను అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులకు ఏ సమయంలో నైనా ఇవ్వడానికి రైతు సేవా కేంద్రాల వద్ద గోనే సంచులు, బరకాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు ప్రైవేటుగా బరకాలను అద్దెకు తెచ్చుకున్నట్లు అయితే సొసైటీలు ద్వారా అది చెల్లించాలని సొసైటీ అధికారులు ఆదేశించారు. తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో రోడ్డు పక్కన ధాన్యం ఆరబెట్టుకున్న రైతుతో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. ధాన్యమును పరిశీలించారు. తేమ శాతం ఎంత ఉందని ఆరా తీశారు. 21.2 శాతం తేమశాతం ఉందని చెప్పగా మీకు అభ్యంతరం లేకపోతే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతును ఆడుగగా, తేమ శాతం తగ్గే వరకు ధాన్యం ఆరబెట్టడం జరుగుతుందని రైతు చెప్పగా రైతుకు అవసరమైన ఏర్పాట్లను చూడాలని అధికారులు ఆదేశించారు.

 

,

*రేషన్ షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి*

 

అత్తిలి మండలం స్కిన్నేరపురం గ్రామంలో 33 రేషన్ షాప్ ను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ పాస్ మిషన్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ విధానమును స్వయంగా ఆయన పరిశీలించారు. ప్రతి నెల రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయని లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు. రేషన్ డీలర్లు ఈ పాస్ మిషన్ల ద్వారా ప్రజా పంపిణీ విధానమును చేయాలని అన్నారు. పరిసరాలన్నీ శుభ్రముగా ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *