గత ప్రభుత్వ హయాంలో రైతుల సొమ్ము బొక్కిన రాజకీయ రాబందుల వద్దనుండి నగదు రికవరీ చేయాలి – అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్…

లీడర్ న్యూస్ (అమరావతి & సచివాలయం) కోపరేటివ్ బ్యాంకులు గడిచిన ఐదు సంవత్సరాలలో త్రీ మెన్ కమిటీ వేసి ఆ సమయంలో ఉన్న శాసనసభ్యులు, అధికారులు దోచుకున్న వాటిపై ఎంక్వెరీ చేపట్టాలని ఏపీ ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమిషన్ చూస్తే 40 కోట్ల రూపాయలు,గడిచిన ఐదేళ్లలో ఆ నగదు రైతులకు డివిడెండ్ల రూపంలో చేరలేదన్నారు.కాబట్టి ఆ నగదును సద్వినియోగం చేయుట కొరకు,ఎవరైనా రైతు ఇంటిలో మరణం కానీ కష్టంగాని సంభవిస్తే ఆ నగదు వారికి ఇచ్చే విధంగా ఒక రూల్ పాస్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కచ్చితంగా ఆ సమయంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల వద్ద కూడా డబ్బు రికవరీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుండి కమిషన్ వచ్చిన నగదు కూడా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక అధికారులు సగం సగం పంచుకొని ఈరోజు 50% డిపాజిట్ ఇస్తే ఉన్న 50% కూడా వారు పంచుకున్న దాఖలాలు ఉన్నాయన్నారు.

రెండు సొసైటీల మీద ఎంక్వయిరీ వేయగా.. 52 వేస్తే 70 లక్షలు కోరుమిల్లి సొసైటీలో అవినీతి జరిగిందని,వారందరికీ 51 వేయమని డిమాండ్ చేస్తున్నానన్నారు.దరుసుపర్రు అనే గ్రామంలో 51 కి ఎంక్వయిరీ చేయమనగా నేటి వరకు ఎంక్వయిరీ జరగలేదన్నారు.

త్వరితగతిన ఎంక్వయిరీ చేసి ఎవరైతే రాజకీయ రాబందులు రైతుల సొమ్ము అవినీతి చేశారో ఆ నగదు తిరిగి RR యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని కోరుతున్నానని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *