ఏపీలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి…

లీడర్ న్యూస్ ప్రతినిధి : రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే నోటిఫికేషన్ వెలువడటానికి ముందే అర్హులైన వారందరినీ చేర్చుతూ జాబితాను అప్‌డేట్ చేయాలని ఎస్‌ఈసీ అధికారులను ఆదేశించారు.ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా అందిన సమాచారం మేరకు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా కొత్త ఏడాది (2027) ఆరంభం నాటికి నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయని తెలుస్తోంది.అంతకు ముందు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమీషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది.

దీని ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రానుంది. అదే విధంగా వార్డుల పునర్విభజనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఇది జూన్ 26 నాటికి పూర్తి కావాలి.

ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. తాజా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమ శాఖలతో ఎన్నికల కమిషనర్ వరుస సమావేశాలు నిర్వహించారు. కోర్టు కేసులు ఉన్న 56 పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల నిర్వహణ సర్వసన్నద్ధంగా ఉంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కూటమి ఎన్నికలు కావడంతో, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిష్పక్షపాతంగా, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *