లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రి కింజరపు అచ్చెంనాయుడు రేపు శనివారం 27వ తేదీ జిల్లాకు రానున్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో సమీక్షించనున్నారు. తణుకు నియోజకవర్గం దువ్వ ప్రాంతంలోని పంట పొలాలను, ఇరిగేషన్ చానల్స్ ను పరిశీలించి, అనంతరం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అక్కడే సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని జిల్లాలోని పంట నష్టాలుపై సమీక్షిస్తారు.