శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ గుడి దారి మూసివేత

లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు ) బుట్టాయిగూడెం మండలంలో భారీగా కురిసిన వర్షాలకు కామవరం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లే రహదారులు వరద ఉధృతి బీభత్సానికి పూర్తిగా పాడైపోయాయి ఆలయ కమిటీ వారు ఆ రహదారులకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఇంకా వర్షం పడుతున్న కారణంగా కొండవాగులు పొంగే అవకాశం ఉంది ఇటువంటి విపత్కర ప్రమాదకర పరిస్థితులలో ఆలయ దర్శనానికి వెళ్లడం మంచిది కాదని భావించి ఆదివారం భక్తులు ఎవరు గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్ళవద్దని పోలవరం డి ఎస్ పి సురేష్ కుమార్ రెడ్డి,జీలుగుమిల్లి సిఐ క్రాంతి కుమార్ సూచన మేరకు బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తెలియజేశారు.ఈ మేరకు ఆలయనికి వెళ్లే రహదారిలో ఉన్న రెండు గేట్లను మూసి వేసినట్లు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *