లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఆంధ్రా బిర్లా స్వర్గీయ డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 103 వ జయంతి సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు పట్టణంలో గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వినీలాకాశంలో దృవ తారగా, ఆంధ్రా బిర్లా గా సుప్రసిద్దులు అయిన డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కష్టే ఫలి, కష్ట పడనిదే ఫలితం లేదు,కష్ట పడడాన్ని ఇష్టపడాలి అని భావించే వ్యక్తి అని కొనియాడారు. న్యాయ బద్దమైన కీర్తి, కాంక్ష లేని కృషి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది అని వారి నమ్మకం అని అన్నారు. తణుకు లాంటి మారుమూల గ్రామంలో ది. ఆంధ్ర షుగర్స్ లాంటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించి తణుకును ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చి సాంప్రదాయాలకు, సంస్కారాలకు, మర్యాదలకు, మన్ననలిచ్చే మహత్తర కృషి వలుడని అన్నారు.మున్సిపల్ చైర్మన్ గా, శాసన సభ్యునిగా తణుకుని అభివృద్ధి పథంలో పయనింపజేసిన ప్రగతి రథసారథి, అటువంటి ఆయన విజయాల వెనుక నిర్విరామమైన కృషి, పట్టుదల, సడలని దీక్ష, కఠోరమైన స్వీయ క్రమశిక్షణ వంటి ఎన్నో సుగుణాలు ఉన్నాయని అన్నారు.
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 103 వ జయంతి – నివాళులు అర్పించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి
28
Jul