పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో వరద ముంపులో చిక్కుకున్న నూట యాభై కు పైగా మూగజీవాలైన పశువులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఆయన గోదావరిలో పడవపై ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మర పడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకున్న పశువులను రక్షించమని రైతులు కోరగా స్పందించారు.
గోదావరి వరదల్లో చిక్కుకున్న పశువులు… — రక్షించి మానవత్వం చాటుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు
28
Jul