లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా అత్తిలి మండలం మంచిలి,ఆరవల్లి , దంతుపల్లి, కంచుమర్రు, స్కిన్నెరపురం, ఈడూరు,కొమ్మర, పాలూరు గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. అనంతరం పంట నష్ట వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకోని, ప్రభుత్వం నుండి అండగా నిలుస్తామని రైతులకు భరోసా కల్పించారు.