* స్పందించి ఆదేశాలు ఇచ్చిన ఎస్పి ప్రతాప్ కిషోర్
* హుటాహుటిన రంగ ప్రవేశం చేసిన పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి
* సంఘటనా ప్రాంతం లో ప్రాధమిక విచారణ చేసిన జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్
లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు )
పోలవరం ఎమ్మెల్యే కారుపై దాడి సంఘటన పై ఏలూరు ఎస్పి ప్రతాప కిషోర్ తక్షణమే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి, జీలుగిమిల్లి సీఐ క్రాంతికుమార్ అప్రమత్తం అయ్యారు. తక్షణమే ఆ పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేశారు. ఆపై విచారణ కూడా షురూ చేశారు. దాడి జరిగింది అనుకునే ప్రాంతానికి జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ వెళ్లారు. అక్కడి పరిసరాల్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు అయితే ఏమీ లేనట్టుగా సమాచారం. అయినా సరే పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు. అయితే, కారు పై రాయి పడడం తో వెనకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. కారుకు ఇంకా ఎలాంటి డ్యామేజ్ లు కాలేదు. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో సరిగ్గా ఓ హాస్టల్ భవనం ఉంది. అందుకే ఇదేదో అనుకోని ఆకతాయిల పనే ఆయుండొచ్చన్న సంకేతాలు గా తోస్తున్నాయి. ఏదేమైనా పోలీసు విచారణ అయితే పూర్తి స్థాయిలో చేసేందుకు ఎస్పి ప్రతాప్ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం అయితే ఉన్నట్టుగా ప్రాథమికంగా అన్పించడం లేదు…?