లీడర్ భాస్కర్ న్యూస్
(ఎన్‌టీఆర్ జిల్లా)
– సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ
– పరిసరాలు, వ్యక్తిగత శుభ్రతపైనా ప్రజలకు అవగాహన కల్పించండి
ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల కట్టడికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.సృజన అన్నారు.
సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డీఆర్‌వో వి.శ్రీనివాసరావుతో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) తదితరాలపై వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్, మండలస్థాయి అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.