లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 18 డిపార్ట్మెంట్లకు పైగా వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం జరుపుకోవడం సంతోషకరమన్నారు.
ప్రజలకు నేరుగా పరిపాలన అందించే విధంగా నాడు నందమూరి తారక రామారావు ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని అన్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయంగా పాటిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.
కానీ దురదృష్టవశాత్తు 2019 నుండి 2024 వరకు గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కేవలం 30 శాతంలోపే ఉండి రాష్ట్ర ఆదాయంలో నిధులు కేటాయించడం జరిగిందని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అన్నారు. నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పుకున్న పార్టీ నేడు తణుకు నియోజవర్గంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ చూస్తుంటే తెలుస్తుందన్నారు. దువ్వ గ్రామంలాంటి గ్రామాల్లో మరొక ఎస్ ఎచ్ సి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
తణుకు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
30
Jul