పింఛన్ పంపిణీపై తప్పుడు ప్రచారం చేశారు.. తొలిరోజే 96% పంపిణి పూర్తి చేశాం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) తణుకు నియోజకవర్గంలో ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కూటమి నాయకులతో కలసి వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు పింఛన్లు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని తప్పుడు ప్రచారం చేశారని,ఉదయం 6 గంటల నుంచి తొలిరోజే 96% పెన్షన్లు పూర్తి చేసేలా పనిచేస్తున్నారన్నారు.ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా పెన్షన్ అందజేస్తామన్నారు.

అత్తిలి మండలం వరిఘేడు, తణుకు మండలం యెర్రనీలిగుంట గ్రామాలకు స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్ముని ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణి చేశారు.

తణుకు నియోజవర్గంలో 15 కోట్ల 16 లక్షల రూపాయల సొమ్మును 36,618 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *