లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) వీధి విక్రయదారుల సంక్షేమానికి,ఉపాధి భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు.గురువారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు జరిగిన సంచార నాలుగు చక్రాల బండ్ల మిక్చర్,పానీపూరి వర్తక సంఘం సమావేశంలో భీమారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన వారు సైతం ప్రభుత్వంపై ఆధారపడకుండా బండ్లపై మిక్చర్,పానీపూరి లాంటి తినుబండారాలు అమ్ముకుంటూ వీధి విక్రయదారులుగా స్వయం ఉపాధి పొందుతున్న వీరికి ప్రభుత్వాలు సబ్సిడీపై బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ట్రాఫిక్ అధికారుల వేధింపులు లేకుండా చూడాలని వారి ఉపాధి భద్రతకు సహకరించాలని భీమారావు కోరారు. గత రెండు దశాబ్దాల ముందే కేంద్రప్రభుత్వం వీధి విక్రయదారుల సంక్షేమానికి అనేక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని దానిలో భాగంగా వీధి విక్రయదారులను గుర్తించి వారికి మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలుకు, అధికారుల వేధింపులు లేకుండా ఉపాధికి భద్రత, చిరు వ్యాపారాల అభివృద్ధికి సబ్సీడితో కూడిన రుణాలు ఇచ్చి వీధి విక్రయదారులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం జరిగిందని కానీ నేటికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు కాకపోవడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు వీధి విక్రయదారుల సంక్షేమానికి కృషి చేయాలని భీమారావు కోరారు.
చిరు వ్యాపారులకు ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి – కొనాల భీమారావు
01
Aug