పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేయడం జరగడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఒకటవ తేదీ ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైందన్నారు.అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *