లీడర్ భాస్కర్ న్యూస్ (ప్రకాశం) ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో గురువారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నెలలోనే ఆదరణ లేక నిరాధారణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా పెన్షన్ల సొమ్ము పెంచి అందిస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులకు మూడు వేలు నుంచి నాలుగు వేలు, దివ్యాంగులకు మూడు వేలు నుంచి ఐదు వేలు, దీర్ఘకాలిక రోగులకు, మంచంపై నుంచి కదలేని వారికి పదిహేను వేలు ఇస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు.