తణుకులో అన్న క్యాంటిన్ పనులు పరిశీలించిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) ప్రతి పేదవారికి పట్టెడన్నం పెట్టాలి అనే సంకల్పంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాలకు అనుగుణంగా గత తెదేపా పాలనలో ప్రారంభించిన అన్న క్యాంటిన్ ల ద్వారా 5 రూపాయలకు భోజనం అందించడం జరిగిందని MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. దురదృష్టవశాత్తు 2019 లో వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత ఆలోచనలతో అర్ధాంతరంగా అన్న క్యాంటిన్ లను మూసి వేసారని తిరిగి మళ్ళీ ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో ఆగష్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటిన్ లను ప్రారంభించడం జరుగుతుందని దానిలో భాగంగా తణుకు పట్టణంలోని మళ్ళీ అన్న క్యాంటిన్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. తెదేపా, జనసేన, బిజెపి పార్టీలు ఎప్పుడు పేదల ప్రక్షాన నిలబడతాయని కొనియాడారు. 2019 నుండి తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్న క్యాంటిన్ భవనాన్ని వదిలేయడంతో తిరిగి నేడు సుమారు 20 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేయవలసి వస్తుందని దీని వల్ల ప్రజా ధనాన్ని గత వైసిపి పాలకులు ఎలా దుర్వినియోగం చేయాలో చెప్పడానికి ఇలాంటివి ఒక ఉదాహరణ అని MLA రాధాకృష్ణ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *