లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఎస్సీ వర్గీకరణ, మాదిగ ఉప కులాలకు సుధీర్ఘంగా చేసిన న్యాయమైన పోరాటంపై సుప్రీంకోర్టులో విజయం పట్ల ఇరగవరం మండల రేలంగి గ్రామంలో మండల అధ్యక్షులు బోస్ తాతపూడి ఆధ్వర్యంలో మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచారు. రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ….మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ కృషితోనే వర్గీకరణ సాధ్యమైందని, మన పిల్లల్ని బాగా చదివించాలి, చదివిస్తేనే వర్గీకరణ అర్ధం ఉంటుందన్నారు.మన పిల్లలు భవిష్యత్ కూడా మారుతుందన్నారు. లాజర్ అబ్బదాసరి తెలిపారు. ఎమ్మార్పీఎస్య కులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
రేలంగిలో MRPS నాయకులు సంబరాలు…
02
Aug