* తణుకులో యుద్ధ ప్రాతిపధికన చేపట్టిన పారిశుద్య నిర్ములన పనులు….
లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను చూస్తుంటే గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకు పట్టణంలో పలు చోట్ల చేపట్టిన డ్రైనేజీలలో సీల్డ్ తొలగింపు పనులను ఆయన దగ్గర పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయాంలో ప్రజారోగ్యం పట్టించుకోకుండా ప్రతిపనికి కమిషన్లు తీసుకుని నిర్లక్ష్యం వహించారని అన్నారు.2019నుండి 2024వరకు తణుకులో పారిశుద్యం పడకేసిందన్నారు. చిన్నపాటి వర్షానికే రొడ్లు మునిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. డ్రైనేజీల్లో నాలుగైదు అడుగులు సీల్డ్ తో నిండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. కనీసం మురుగునీరు ప్రవహించడానికి కూడా దారి లేకుండా డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్థవ్యస్థమైందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం నెల రోజుల్లో యుద్ధప్రాతిపదికన పట్టణాన్ని పారిశుద్ధ్యంలో మెరుగుపరిచి ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామన్నారు.