లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు) జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయాన్ని రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరద ముంపు గ్రామంలో శనివారం సుమారు మూడు లక్షల విలువ గల పది టన్నుల పశువుల దాణాను రైతులకు పంపిణీ చేశారు. మంత్రి రామానాయుడు వరద బాధితులతో పాటు రైతులను పలకరించారు . ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి రామానాయుడు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతులు పంట పండించుకోలేని పరిస్థితుల్లో పంట విరామం తీసుకున్నారని తెలిపారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి ప్రభుత్వ కార్యాలయాలు, విలువైన ప్రభుత్వ భూములను సైతం లక్షలాది కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని మంత్రి రామానాయుడు తెలిపారు.