లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) కాకతీయ సంఘం, బండా పట్టాభి పౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ లు పంపిణీ చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఒకతరం చదువుకుంటే భవిష్యత్ లో ఆ కుటుంబాలు ఎంతో అభివృద్ధి లో వెళ్తాయి అనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి నాంది పలికిన రామచంద్రరావుకి MLA రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేసారు. ఒక మంచి సంకల్పం తో ప్రారంభించిన కాకతీయ సంఘం,బండా పట్టాభి పౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని ఈ విద్యా సంవత్సరం లో దాదాపు 22 లక్షల రూపాయలుతో 213 మంది విద్యార్థుల కు స్కాలర్షిప్ లు అందించడం చాలా సంతోషకరమన్నారు. కేవలం కాకతీయ సంఘానికి చెందిన వారికి మాత్రమే కాకుండ ఇతర వర్గాల పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ లు అందించడం చాలా మంచి విషయం అని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్ కి పెద్దపీట వేసే ప్రభుత్వం ఏర్పడిందని విద్యా వ్యవస్థ లో విద్యార్థులకు భవిష్యత్ బాగుండేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నో మార్పులు చేస్తున్నారని ఉన్నత చదువులు, జాబ్ లు వచ్చేలా సంస్కరణలు తీసుకొస్తున్నారని MLA రాధాకృష్ణ తెలిపారు.
కాకతీయ సంఘం,బండా పట్టాభి పౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ లు పంపిణీ.. * కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
04
Aug