రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యతే ప్రగతికి మార్గం – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం భావ్యం కాదు..
• తోటి డ్రైవర్లుగా మానవత థృక్పధంతో తెలంగాణ డ్రైవర్లు సహకరించాలి..
• 2 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది..
• తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా సమస్యను పరిష్కరించాలి..
• ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్ల సమస్యపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ ( మంగళగిరి )తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య నా దృష్టికి వచ్చిందన్నారు. వారికి అక్కడి క్యాబ్ డ్రైవర్ సోదరులు సానుకూలంగా స్పందించి, వారి భృతి విషయంలో సహకరించాలని ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  కోరారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లను అడ్డుకుంటున్నారని, దీంతో అక్కడ బతకలేకపోతున్నామని వందలాది క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను చెప్పేందుక మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారని తెలియజేశారు .ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు అయిపోందని, మీరు హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు, క్యాబ్ డ్రైవర్లు మమ్మల్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చే

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయి. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదు. 2 వేల కుటుంబాల వేదన దీనిలో దాగుంది. మానవత థృక్పధంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం.రెండు తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది.’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *