తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నందు ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న మొదలైందని…అందుకే ప్రతి ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తణుకు కూటమి నాయకులు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ  ఆదేశాలు మేరకు తణుకులో చేనేత దినోత్సవం జరిపారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఈ రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, సర్కార్‌ సహకారం అందక చేనేత వృత్తిని నమ్ముకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు, కార్మికుల జీవితాల్ని మెరుగుపర్చేందుకు కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతోందని తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.చేనేతలకు ఇచ్చే అన్ని రుణాలను వైసీపీ రద్దు చేసింది. నేత కార్మికులకు 226కోట్ల బకాయిలు ఉంచారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దేవాంగ సంఘ రాష్ట్ర కన్వీనర్ బీరకాయ ప్రసాదు, వావిలాల సరళ దేవి, విశ్వనాథం కృష్ణవేణి ,గుబ్బల శ్రీనివాస్, కొమిరెడ్డి శ్రీను ,చింతలపూడి సన్యాసిరావు, ఆకుమర్తి శ్రీను, నక్క చంద్రశేఖర్ ,మల్లేశ్వరరావు, సప్పవరపు శ్రీను, వరద నాగ మల్లులు ,అక్కిశెట్టి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *