సీపీఎం జాతీయ నేత బుద్ధదేవ్ భట్టాచార్య మృతి తీరని లోటు – కొనాల భీమారావు

లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీయ నేత బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.11సంవత్సరాలు పాటు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు.మతతత్వ పాలనతో ప్రజాస్వామ్యం,లౌకిక రాజ్యాంగానికి దేశంలో పెనుప్రమాదం పొంచి వున్న  ప్రస్తుత పరిస్థితుల్లో  బుద్ధదేవ్ లాంటి నిబద్ధత కలిగిన వామపక్ష నేతలు మృతి చెందడం వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్యానికి తీరని లోటన్నారు.బుద్దదేవ్ మృతికి సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తరపున నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *