ఉన్నత విద్యా శాఖాధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్…

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఉన్నత విద్యాశాఖ అధికారులతో  మంత్రి నారా లోకేష్  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్ చేసేందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీ నెలకొల్పే అంశంపై చర్చించారు. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ వంటి 16రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించవచ్చు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీ ద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్ మెంట్ విసి,­ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *