లీడర్ భాస్కర్ న్యూస్(రాజమండ్రి )ఆదివాసులు ప్రస్తుత సమాజ మూలాలని, అప్పటి నుండి పురాతన సంప్రదాయాలలో కట్టుబడి , ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నారని , వారికి తగిన గౌరవం సౌకర్యాలు కలుగచేయవలసిన భాద్యత ప్రభుత్వం నగర పౌరులపై ఉందని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ అన్నారు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ప్రాగణంలో జరిగిన ‘ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ’ కార్యక్రమంలో రవీంద్రనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ ‘ వందన వికాస్ యోజన ‘ పధకాన్ని మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించుకోవాలని , తద్వారా 300 మంది గిరిజనులు ఒక గ్రూప్ గా ఏర్పడితే 15 లక్షల గ్రాంట్ పొందగలరన్నారు. ఈ మొత్తాన్ని గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా సంగ్రహణ , విశ్లేషణ , ప్యాకింగ్ మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని రవీంద్ర నాథ్ తెలిపారు . ఏజెన్సీ ప్రాతంలో శిశు మరణాలు దేశ సగుటతో పోలిస్తే 63 శాతం అధికంగా ఉన్నాయని , వారికి తగిన వైద్య సౌకర్యాలు కల్పిచాలని వంక రవీంద్ర కోరారు.