లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) క్విట్ ఇండియా డే సందర్భంగా రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ దేశ వ్యాపిత పిలుపులో భాగంగా తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు మీటింగ్ హాలులో క్విట్ కార్పోరేట్ సభ జరిగింది. దారిదీపం సంపాదకులు డీవీవీయస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్, జాతీయవేదిక నాయకులు డాక్టర్ బి.రమేష్ చంద్రబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షుడు పి.మురళీకుమార్, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకురాలు సంకు మనోరమ, రైతు కార్యాచరణ సమితి నాయకులు లంక కృష్ణమూర్తి, అభ్యుదయ వాది షెట్టి తదితరులు మాట్లాడారు. సభానంతరం స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులకు సత్కారం జరిగింది.
తణుకు సురాజ్య భవన్ లో క్విట్ కార్పొరేట్ సభ…
09
Aug