లీడర్ భాస్కర్ న్యూస్(మంగళగిరి) టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రజాదర్బార్ లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెండు కాళ్లు లేని శోభ అనే దివ్యాంగురాలు రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు తొలగించారని, వంద శాతం సదరన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ గత వైసిపి ప్రభుత్వం లో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే ఆంక్షలతో పెన్షన్ తొలగించారంటూ మంత్రి రామానాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేయగా ఆయన స్పందించి పెన్షన్ పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయంకి తెలిపి న్యాయం చేయమని కోరారు. దివ్యాంగురాలు నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆమె పరిస్థితిని వివరించడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా వెను వెంటనే స్పందించి ప్రభుత్వ వరంగా మీరు చెయ్యండి… వ్యక్తిగతంగా సాయం అందిస్తానంటూ మంత్రి రామానాయుడుకు తెలిపారు. బాధితురాలు మీతో మాట్లాడతుందని చెప్పి ఫోనును ఆమెకు ఇవ్వగా శోభమ్మ అంటూ ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ పరంగా రామానాయుడు చూస్తారు… నేను వ్యక్తిగతంగా సాయం చేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భరోసా ఇవ్వగా ఎప్పుడు రమ్మంటారని ఆమె అడగ్గా నీవు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఫోన్ చేసి రమ్మని తెలిపారు. దివ్యాంగురాలికి న్యాయం చేయమని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరడంతో పాటు అప్పటికప్పుడు ఆమెకు కొంత ఆర్థిక సహాయాన్ని మంత్రి రామానాయుడు అందించారు. దివ్యాంగురాలు పట్ల మంత్రి రామానాయుడు మానవత్వంతో స్పందించిన తీరుకు ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. ప్రజా దర్బార్ కి వచ్చిన ప్రజలు ఆయనను, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు తెలుగుదేశం పార్టీలో పదవులు అధికారం కోసమో, అనుభవించడానికి కాదని మా దగ్గరకు వచ్చే ప్రజలకు సాయం అందించడం మా బాధ్యత, మా ధర్మమని పేర్కొన్నారు.
ప్రజా దర్బార్ లో దివ్యాంగురాలిపై మానవత్వంతో స్పందించిన మంత్రి రామానాయుడు…..
09
Aug