లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) మండపేట తహశీల్దార్ గా పి తేజేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు కృష్ణాజిల్లా నుంచి బదిలీపై వచ్చిన తాహసిల్దార్ సురేష్ కుమార్ సొంత జిల్లాకు బదిలీ కాగా ఇప్పుడు తాజాగా తాహాసిల్దార్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మండపేట తహసిల్దార్ గా తేజేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2019 ముందు కోటనందూరు,ముమ్మిడివరం తహసిల్దార్ గా పనిచేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ లో ఏ ఓ గా పనిచేశారు. చింతూరు తహసిల్దార్ గా పనిచేశారు. 2019 తర్వాత రామచంద్రపురం తహసిల్దార్ గా బాధ్యతలు నిర్వహించారు. విజయవాడ సెక్రటేరియట్ జి ఏ డి లో భాద్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో కృష్ణ జిల్లా కలెక్టరేట్ లో సుపరిండెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మండపేట తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. తహసిల్దార్ కార్యలయం లో ఆయనకు కార్యలయం డిటి అశోక్, ఎన్నికల డి టి బాబా, సిబ్బంది, విఆర్ఓ లు స్వాగతం పలికారు.
మండపేట తహాశిల్దార్ గా తేజేశ్వరరావు బాధ్యతల స్వీకరణ…
09
Aug