లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) న్యూడిల్లీ లోని NDMC కన్వెన్షన్ సెంటర్ లో నూతనంగా ఎన్నికైన యాదవ బిసి సామాజిక వర్గ ఎంపీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సమాజ్ వాదీ పార్టీ అధినేత , యూపీ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్, ఇతర పెద్దలతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అఖిల భారత వర్షియ యాదవ మహాసభ , KGF ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఎన్నికైన యాదవ, బీసీ ఎంపీలు హాజరైయ్యారు.ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటుకు ఎన్నికైన ఏలూరు పుట్టా మహేష్ కుమార్ ను అఖిల భారత వర్షియ యాదవ మహాసభ మరియు KGF ఇండియా ఆర్గనైజేషన్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహచర ఎంపీలు బి.నాగరాజు, బీద మస్తాన్ రావు కూడా పాల్గొన్నారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఢిల్లీలో ఘనసత్కారం.
11
Aug