లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి జట్టు ఎంపీకలు నిర్వహించారు. మండపేట శ్రీ వేగుళ్ళ సూర్యరావు ఉన్నత పాఠశాల క్రీడ ప్రాంగణంలో బాల బాలికలు టెన్ని కోయిట్ జిల్లా సెలక్షన్ నిర్వహించారు. పోటీలలో 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలురు విభాగం లో మండపేటకు చెందిన చైతన్య వీరంజై, రాజమండ్రి కి చెందిన రమణబాబు, కరప చెందిన సంతోష్, అమలాపురానికి చెందిన లక్ష్మణ్ లు విజేతగా నిలిచారు. బాలికల విభాగంలో వానపల్లి కి చెందిన అనిత కీర్తన లావణ్య, తుని చెందిన దీప్తి శ్రీ, అనపర్తి చెందిన అంకిత లు విజేతలుగా నిలిచారు. వీరు సెప్టెంబర్ నెల గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా జాయింట్ సెక్రెటరీ కుంచె రమేష్ క్రీడా దుస్తులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొచ్ లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక…
12
Aug