దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు.. చెన్నై లో ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి..

లీడర్ భాస్కర్ న్యూస్ ప్రతినిధి :- తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంచేరి ప్రాంతంలో ఆదివారం వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతులను ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్‌ (21), తిరుపతికి చెందిన యుగేశ్‌ (23), చేతన్‌ (22), కర్నూలుకు చెందిన రామ్మోహన్‌ (21), విజయవాడకు చెందిన బన్ను నితీష్‌ (22), నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యగా గుర్తించారు. వీరంతా స్నేహితులు. చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు.వారందరూ శనివారం, ఆదివారం సెలవు కావడంతో కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లారు.స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విష్ణు, చైతన్యలను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారులోనే మృతదేహాలన్నీ చిక్కుకుపోయాయి. దీంతో పోలీసులు అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ప్రమాదంపై కేకే చత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *