లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఏలూరులో ప్రారంభమైంది. గత ప్రభుత్వం రైతులకి రూ.1674 కోట్లు బకాయి పెట్టిందని మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే రూ. వెయ్యి కోట్లు బకాయి చెల్లించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన రూ.674 కోట్లు ఈ రోజు విడుదల చేశామన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు.
ఏలూరులో రైతులకు ధాన్యం బకాయి చెక్కులు పంపిణి ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్…
12
Aug