24 వ రోజు కోనసాగిన మంత్రి లోకేష్ “ప్రజా దర్బార్ “

లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 24వ రోజు “ప్రజా దర్బార్” నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎమ్ఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటుచేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు. పెన్షన్, విద్య, వైద్యం, వైసిపి నేతల భూకబ్జాలకు సంబంధించిన పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్హా వారికి హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *